క్యాంటీన్‌ సాంగ్ మేకింగ్ వీడియో చూశారా ?


యూత్ మెగాస్టార్ విజయ్ దేవరకొండ నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. రష్మిక మందన కథానాయిక. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వం వహించారు. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో స్వీడుని పెంచారు. ఇందులో భాగంగా ఇటీవలే విడుదల చేసిన కాలేజ్ క్యాంటీన్ సాంగ్ మంచి స్పందన వచ్చింది.

తాజాగా, ఈ సాంగ్ మేకింగ్ వీడియోని విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో క్యాంటీన్ లో కామ్రేడ్ చేసిన హంగమా చూడొచ్చు. మొత్తం సింగిల్ టేక్ లో తీసినట్టు మేకింగ్ వీడియో అనిపిస్తోండి. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ నెల 26న ‘డియర్‌ కామ్రేడ్‌’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.