వార్నర్ ఫాదర్ సెంటిమెంట్.. సఫారీలకు మూడినట్టే !

ఆసీస్‌ విధ్వంసక ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ మూడోసారి తండ్రైన సంగతి తెలిసిందే. అతడి భార్య క్యాండిస్‌ ఆదివారం మూడో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వార్నర్ కు ఫాదర్ సెంటిమెంట్ ఉంది. ఆయన తండ్రైన ప్రతిసారి రెచ్చిపోయి ఆడాడు. వార్నర్‌ సతీమణి 2014లో మొదటి బిడ్డను ప్రసవించింది. ఐవీ మేకు జన్మనిచ్చింది. ఆ సంతోషంలో వార్నర్ అద్భుతంగా ఆడాడు. తొలి టెస్టు మ్యాచ్‌ ఆడి శతకం బాదేశాడు. 2016లో ఇండీ రే పుట్టింది. ఆ తర్వాత ఆడిన రెండు వన్డేల్లో డేవీ వరుసగా 93, 122తో చెలరేగాడు.

ఈ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జూన్‌ 6న చివరి లీగ్‌ మ్యాచ్‌ను ఆడనుంది. ఐతే, మూడోసారి తండ్రైన తర్వాత వార్నర్ ఆడబోతున్న మొదటి మ్యాచ్ ఇది. ఈ నేపథ్యంలో ఈసారి సఫారిలనీ వార్నర్ ఊచకోత కోయడం ఖాయం అంటున్నారు. ఇదీగాక, ఇప్పటికే సెమీస్ చేరిన ఆసీస్ ఈ పోరులో విధ్వంసకరంగా ఆడే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రపంచకప్ లో వార్నర్ ప్రపంచకప్‌లో 8 మ్యాచుల్లోనే 516 పరుగులు చేశాడు.