ఏపీలో మెగా డీఎస్సీ ప్రకటన

నిరుద్యోగులకి గుడ్ న్యూస్. ఏపీ ప్రభుత్వం మెగా డీఎస్సీని నిర్వహించబోతుంది. ఏపీలోని గ్రామ సచివాలయాల్లో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ అధికారులకి ఆదేశాలిచ్చారు. జులై 15 నాటికి నోటిఫికేషన్‌ జారీ చేసి.. అక్టోబర్‌ 2 నుంచి గ్రామ సచివాలయాలని ఏర్పాటు చేయనున్నారు.

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో బుధవారం సీఎం సమీక్ష నిర్వహించారు. అక్టోబర్‌ 2 నుంచి గ్రామ సచివాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి 2వేల మందికి గ్రామ సచివాలయం ఉండాలని.. అందులో ఉద్యోగాలను జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) ద్వారా భర్తీ చేయాలని స్పష్టం చేశారు.