ఇద్దరమ్మాయిలూ పెళ్లి చేసుకున్నారు.. !
అవునూ.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. పెళ్లి కూడా చేసుకొన్నారు. కాన్పూర్‌కు చెందిన ఇద్దరు యువతులూ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అబ్బాయిలపై నమ్మకం లేక యువతులిద్దరూ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఇద్దరూ కాన్పూర్ నుంచి వారణాసి జిల్లాలోని విర్భన్‌పూర్‌లోని రొహానియా ప్రాంతానికి వచ్చి అక్కడ హనుమాన్ ఆలయ పూజారిని ఆశ్రయించారు.
తమకు వివాహం జరిపించాలని కోరారు. ఆ ఇద్దరమ్మాయిలతో బంధువులెవరూ రాకపోవడంతో స్థానిక గ్రామస్థులే పెళ్లిపెద్దలుగా నిలిచారు. ఇద్దరు యువతులూ తమను సంప్రదించారనీ.. బంధువులెవరూ లేకపోవడంతో తామే హనుమంతుడి సాక్షిగా వారిద్దరికీ వివాహం జరిపించామని స్థానికులు, ఆలయ పూజారి తెలిపారు. ఈ తతంగమంతా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.