‘భాగమతి’ నటి భర్త మిస్సింగ్.. !


అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘భాగమతి’ సినిమాలో పోలీసు అధికారిగా నటించారు మలయాళ నటి ఆశా శరత్‌. ఆమె ‘నా భర్త కనిపించడం లేదు. మీరు ఆయన్ని ఎక్కడైనా చూసుంటే కేరళలోని కట్టప్పన పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి’ అని ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో వైరల్ అయింది. నిజంగానే ఆశా భర్త మిస్సయ్యాడని అందరూ అనుకొన్నారు. ఐతే, ఈ సీరియన్స్ న్యూస్ వెనక సినిమా ప్రమోషన్స్ దాగుందని ఆ తర్వాత తెలిసింది.

మలయాళంలో ఆశా నటించిన చిత్రం ‘ఎవిడే’. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఆశా తన ఫేస్‌బుక్‌ ఖాతాలో తన భర్త మిస్సయ్యడంతూ.. వీడియోను పోస్ట్‌ చేశారు. సినిమా కోసం చేసిన ప్రచార వీడియోనని తెలిసిన తర్వాత నెటిజన్లు ఆశా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రచార జిమ్మిక్ లని మానుకోవాలని హితుపలికారు.