బడ్జెట్ పార్శిల్‌ చేశారు

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం లోక్‌సభలో బడ్జెట్‌-2019ను ప్రవేశపెట్టారు. ఐతే, ఈసారి బ్రిటిష్‌ కాలం నాటి సంప్రదాయాన్ని పక్కనబెట్టి బ్రీఫ్‌ కేస్‌కు బదులుగా ఎర్రటి వస్త్రంలో బడ్జెట్‌ పత్రాలను తీసుకొస్తూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పారు.

మోదీ 2.0 ప్రభుత్వంలో ఇదే తొలి బడ్జెట్‌. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భాజపా.. ఈ సారి కీలకమైన ఆర్థికశాఖ బాధ్యతలను మహిళకు అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత ఈ బాధ్యతలు చేపట్టిన మహిళ నిర్మలా సీతారామన్‌ కావడం విశేషం. బడ్జెట్-2019లో పేద, మధ్యతరగతి, రైతులకి పెద్ద పీఠ వేశారు. ఆదాయ పన్ను పరిమితిని రూ. 5లక్షల వరకు పెంచారు. బ్యాంకు పరీక్షలని ప్రాంతీయ బాషల్లో రాసుకొనే అవకాశం కల్పించారు