‘ఓ బేబీ’ సక్సెస్ సెలబ్రేషన్స్ చూశారా ?


అభిమానులని సమంత మరోసారి సప్రైజ్ చేసింది. ఆమె ప్రధాన పాత్రలో నందినిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ బేబీ’. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఓ బేబీ’ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకొంది. సమంత మరోసారి మేజిక్ చేసింది. స్వాతి పాత్రలో జీవించేసింది. నవ్వించింది. ఏడిపించింది. ఫైనల్ గా ప్రేక్షకులని మురిపించిందని రివ్యూలు చెబుతున్నాయి. ఈ ఆనందంలో చిత్రబృందం సక్సెస్ సెలబ్రేషన్స్ మొదలెట్టింది. డబ్బు, దరువుతో హుషారుగా చిత్రబృందం కేక్ కట్ చేసింది.

దానికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత కేక్ కట్ చేసి.. సీనియర్ నటి లక్ష్మీ, దర్శకురాలు నందినిరెడ్డి, అభిరామ్.. తదితరులు కేక్ తినిపించింది. ఓ బేబీ హిట్ టాక్ తో సామ్ మొహం వెలిగిపోతుంది. ఓ బేబీ మాములు హిట్ కాదు. సామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గా నిలుస్తుందని రివ్యూలు చెబుతున్నాయి. రూ. 100కోట్ల కలెక్షన్స్ క్రాస్ చేయొచ్చని చెబుతున్నారు. సినిమా ఫ్యామిలీ, యూత్ ప్రేక్షకులని కనెక్ట్ అయ్యేలా ఉండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు.