రివ్యూ : ఓ బేబీ
చిత్రం : ఓ బేబీ (2019)
నటీనటులు : సమంత, లక్ష్మి, రాజేంద్రప్రసాద్, నాగశౌర్య, మాస్టర్ తేజ, రావు రమేశ్, జగపతిబాబు, ప్రియదర్శి తదితరులు
సంగీతం : మిక్కీ జే మేయర్
దర్శకత్వం : నందినీ రెడ్డి
నిర్మాణ సంస్థ : సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
రిలీజ్ డేట్ : 05జూన్, 2019
పెళ్లి తర్వాత సమంత ప్రయోగాల వైపు చూస్తున్నారు. నటనకి ఆస్కారం ఉన్న కథలని మాత్రమే ఎంచుకొంటున్నారు. ఈ క్రమంలో రంగస్థలం, సూపర్ డీలక్స్, అభిమన్యుడు, యూటర్న్, మజిలీ లాంటి విజయాలు అందుకొన్నారు. ప్రేక్షకులని వరుసగా సప్రైజ్ చేస్తున్నారు. మజిలీ తర్వాత సామ్ నటించిన చిత్రం ‘ఓ బేబీ’. ఈ చిత్రానికి నందినిరెడ్డి దర్శకత్వం వహించారు.
70యేళ్ల భామ 24యేళ్ల యువతిగా మారితే ఎలా ఉంటుంది ? అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రమిది. కొరియన్ చిత్రం ‘మిస్ గ్రానీ’ నుంచి తీసుకున్న కాన్సెప్ట్ ఇది. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ‘బేబీ’ ఆకట్టుకుందో లేదో చూద్దాం పదండీ.. !
కథ :
బేబీ (లక్ష్మి) 70 ఏళ్ల ‘భామ’. కల్మషం లేని మనిషి. భర్త చనిపోతూ చేతిలో పెట్టిన కుమారుడు శేఖర్ (రావు రమేష్) ఆమెకు సర్వస్వం. చిన్ననాటి స్నేహితుడు చంటి (రాజేంద్రప్రసాద్)తో కలిసి ఒక క్యాంటీన్‌ని నిర్వహిస్తూ ఉంటుంది. పాతకాలపు మనిషి కావడంతో ఆమె చాదస్తంతో ఇంట్లో కోడలు (ప్రగతి), కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతుంటారు. కోడలికి గుండెపోటు కూడా వస్తుంది. అందుకు బేబీనే కారణమని కుటుంబ సభ్యులు భావించడంతో ఇంటి నుంచి వెళ్లిపోతుంది.
అలా వెళ్లిపోయిన ఆమె 24 ఏళ్ల పడుచు పిల్ల స్వాతి (సమంత)గా మారిపోతుంది. అదెలా ? వయసు తిరిగొచ్చాక ఆమె ఏం చేసింది? కుటుంబానికి మళ్లీ ఎలా దగ్గరైంది ? స్వాతినే బేబి అని తెలిశాక చంటి, కుమారుడు శేఖర్ (రావు రమేష్) ఎలా స్పందించాడు ? అనేది వినోదం, ఎమోషన్స్ తో సాగిన కథ.
ప్లస్ పాయింట్స్
* సమంత, లక్ష్మీ
* కథ
* మాటలు
* వినోదం, భావోద్వేగాలు
మైనస్ పాయింట్స్
* సెకాంఢాఫ్ లో కొన్ని చోట్ల సాగదీత
నటీనటుల ఫర్ ఫామెన్స్ :
70 ఏళ్ల బామ్మ పడుచు పిల్లగా మారిపోవడమనేది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ని కొరియన్ చిత్రం ‘మిస్ గ్రానీ’ నుంచి తీసుకొన్నారు. ఈ కాన్సెప్ట్‌ని తెలుగు ప్రేక్షకుల అభిరుచులకి అనుగుణంగా తీర్చిదిద్దడంలో దర్శకురాలు నందినీరెడ్డి విజయవంతమయ్యారు.
స్థానికత ఉట్టిపడేలా కథని నడిపించారు. కాసేపు నవ్వులు, కాసేపు గుండె బరువెక్కించే భావోద్వేగాలతో ప్రేక్షకుడిని కథలో లీనం చేస్తుంది.పెద్దవాళ్లలో కనిపించే చాదస్తపు అలవాట్లు, ఇంట్లో పిల్లల విషయంలోతీసుకునే శ్రద్ధ, కోడళ్లపై వాళ్లు చెలాయించే పెత్తనం వంటి అంశాల్ని సహజంగా తీర్చిదిద్దారు. బేబీ స్వాతిగా మారాకే అసలు కథ మాత్రం మొదలవుతుంది.
ఇక, స్వాత్రి పాత్రలో సమంత జీవించేసింది. వృద్ధురాలిగా కనిపించిన లక్ష్మిని పోలినట్టుగానే హావభావాలు ప్రదర్శించడం, ఆమెలాగా నడవడం, మాట్లాడటం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. లుక్, గ్లామర్ విషయంలో అదరగొట్టింది. బేబీ పాత్ర ఆమె కోసమే పుట్టిందా అన్నట్టుగా ఆ పాత్రలో జీవించారు. కాస్తా హైపర్ యాక్టివ్‌ను కాస్త తగ్గిస్తే స్వాతి పాత్ర మరింత మెప్పు సాధించేదేమో అనిపిస్తుంది. రావు రమేష్, నాగశౌర్య, ప్రగతి, ఊర్వశి, ఐశ్వర్య, తేజ…ఇలా అందరూ తమ పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. జగపతిబాబు, అడివి శేష్ చిన్న పాత్రల్లో మెరుస్తారు.
సాంకేతికంగా :
లక్ష్మీ భూపాల మాటలు చాలా బాగున్నాయి. బామ్మలు మాట్లాడే మాటలకి తగ్గట్టుగానే సామెతలు జోడించిన విధానం ఆకట్టుకుంటుంది. మిక్కీ జె.మేయర్ సంగీతం, నేపథ్య సంగీతం బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. సెకాంఢాఫ్ కాస్త సాగదీసినట్టు అనిపించింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
బాటమ్ లైన్ : బేబీ నవ్విస్తుంది.. ఏడిపిస్తుంది.
రేటింగ్ : 3.5/5