‘ఓ బేబీ’ అంచనాలని మించేలా.. !

సమంత మరోసారి మేజిక్ చేసింది. ఈసారి అంచనాలని మించేలా ఆమె మేజిక్ ఉందని చెబుతున్నారు. సమంత ప్రధాన పాత్రలో నందినిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ బేబీ’. భారీ అంచనాల మధ్య ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా అద్భుతంగా ఉందనే టాక్ వచ్చేసింది. సమంత నవ్వించింది. ఏడిపించింది. రాక్ స్టార్ లా సినిమాని నడిపించిందని చెబుతున్నారు. ఆమె నటనకు మాటల్లేవ్. అంతలా జీవించేసింది. నందినిరెడ్డి కెరీర్ లో ఇది బెస్ట్ సినిమా. కథ-కథనం అద్భుతంగా కుదిరాయి. నటీనటులు అందరు బాగా నటించారని చెబుతున్నారు. నిజాయతీతో తీసిని కథ బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం అంటున్నారు

మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. వినోదం ఉంది. ఎమోషన్స్ కుదిరాయి. లక్ష్మీ భూపల్ డైలాగ్స్ అదిరిపోయాయి. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం బాగా కుదిరిరాయి. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓ బేబీ వన్ ఉమెన్ షో. ఓవర్సీస్ నుంచి కూడా మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. సినిమా చూసిన తర్వాత అమ్మ, నాన్నమ్మ, అమ్మమ్మలని గుర్తుతెచ్చుకోవడం గ్యారెంటీ. ఫ్యామిలీ కలిసి తప్పక చూడాల్సిన సినిమానని చెబుతున్నారు. ఓ బేబీతో సామ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడినట్టే.