‘సాహో’ సాంగ్ టీజర్ చూశారా ?


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘సాహో’. ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ కి జోడీగా శ్రద్దాకపూర్ నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 15న సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచింది చిత్రబృందం. ఇటీవలే టీజర్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సాహో తొలి సాంగ్ టీజర్ ని విడుదల చేశారు.

ఇందులో శ్రద్దాకపూర్ హాట్ హాట్ గా డ్యాన్స్ చేయడం చూడొచ్చు. #PsychoSaiyaan అంటూ సాగే ఈ సాంగ్ లో ప్రభాస్-శ్రద్దాల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. ఈ పాటని ధవని భానుశాలి పాడారు. వినాయక్ శశికుమార్ రిలిక్స్ అందించారు. తనీష్ భాగ్జి సంగీతం అందించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ని దాదాపు రూ. 300కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.