కేంద్ర బడ్జెట్-2019 హైలైట్స్

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం లోక్‌సభలో బడ్జెట్‌-2019ను ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్‌ పత్రాల బ్రీఫ్‌ కేస్‌ మారింది. ఆ స్థానంలో ఎర్రటి పార్శిల్‌ లాంటి బ్యాగ్‌ వచ్చింది. పది లక్ష్యాలతో ఈ దశాబ్దానికి లక్ష్యాలను నిర్ణయించుకున్నాం. ఈ అంశాల స్ఫూర్తిగా ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేశామని మంత్రి తెలిపారు.

బడ్జెట్-2019 ముఖ్యాంశాలు :

* 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థవైపునకు దూసుకెళ్తున్నాం

* ప్రస్తుతం భారత్‌ 2.5 లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థగల దేశంగా మారింది

* 1.9కోట్ల నివాసాల నిర్మాణం జరుగుతోంది. ఇళ్ల నిర్మాణ కాలాన్ని 114 రోజులకు తగ్గించాం.

* గ్రామీణ భారతానికి ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నాం. 2022 నాటికి అన్ని నివాసాలకు విద్యుత్‌, గ్యాస్‌ సరఫరా

* జీరో బడ్జెట్‌ వ్యవసాయం (పెట్టుబడులు లేకుండా వ్యవసాయం) ప్రవేశపెడుతున్నాం.

* ‘జలశక్తి మంత్రిత్వశాఖ’ ఏర్పాటు. అన్ని నీటి వనరుల నిర్వహణ. ‘హర్‌ ఘర్‌ జల్‌’ పథకంలో భాగంగా నివాసాలకు నీటి సరఫరా.

* డీజిల్‌, పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం రూ.1 పెంపు.

* బంగారంపై కస్టమ్స్‌ సుంకం 10 నుంచి 12.50శాతానికి పెంపు

* 5 కోట్ల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం కలిగిన వారిపై సర్‌ఛార్జీ పెంపు

* ఆశ, విశ్వాసం, ఆకాంక్షల ప్రాతిపదికన గత ఐదేళ్లలో అదనంగా ఒక ట్రిలియన్‌ డాలర్లను ఆర్థిక వ్యవస్థకు జోడించాం.

* ప్రత్యక్ష పన్నులు, రిజిస్ట్రేషన్‌లో అనేక మార్పులు తెచ్చాం. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి సౌకర్యంతో స్వచ్ఛ భారత్‌ నిర్మితమైంది.

* మేకిన్‌ ఇండియాతో దేశంలో తయారీ పరిశ్రమ వేగమందుకుంది

* ప్రధానమంత్రి సడక్‌ యోజన, ఉడాన్‌, పారిశ్రామిక కారిడార్‌, రవాణా, రైల్వేలు ఇతర మార్గాలను నిర్మిస్తున్నాం

* ఇప్పటివరకూ దేశంలో 657కి.మీ.ల మెట్రో మార్గం ఉంది. మరో 300కి.మీ.ల మెట్రో మార్గానికి అనుమతులు లభించాయి

* ఒకే దేశం.. ఒకే గ్రిడ్‌ విధానంలో భాగంగా అన్ని ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం

* గత ఐదేళ్లలోనే దేశ ఆర్థిక వ్యవస్థ విలువను లక్ష కోట్ల డాలర్లు పెంచాం. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో పారిశ్రామిక రంగం కీలక పాత్ర పోషిస్తోంది.

* ఎంఎస్‌ఎంఈలకు రూ.కోటి వరకూ రుణ సదుపాయం

* మినిమమ్‌ గవర్నమెంట్‌, మ్యాగ్జిమమ్‌ గవర్నన్స్‌ మా విధానం. పరిశ్రమలకు అనుమతుల ప్రక్రియను మరింత సరళతరం చేస్తాం.

* ప్రధాన మంత్రి కర్మయోగి మాన్‌ధన్‌ యోజన ద్వారా చిల్లర వర్తకులకు పింఛన్‌ పథకం తీసుకువస్తాం.

* విదేశీ పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొత్త విధానం. రెడ్‌ టేపిజం నియంత్రణకు చర్యలు

* మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా అంత్యోదయ పథకం మరింత విస్తరణ

* ఇస్రో సేవలను వాణిజ్యపరంగాను వృద్ధి చేసేందుకు ప్రత్యేక కంపెనీ. ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు. అంతరిక్ష ప్రయోగాల ఉత్పత్తులు, మార్కెటింగ్‌కు ప్రత్యేక వ్యవస్థ

* మీడియా, యానిమేషన్‌, విమానయాన రంగంలో ఎఫ్‌డీఐలపై పరిశీలన

* ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 78శాతం పెరిగాయి. 2018లో పన్ను వసూళ్లు రూ.11.37లక్షల కోట్లు

* మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవారికి ప్రోత్సాహకాలు. రూ.45లక్షలులోపు గృహరుణాలపై రూ.3.5లక్షలు వడ్డీ రాయితీ. వడ్డీ రాయితీ రూ.2లక్షల నుంచి రూ.3.50లక్షలకు పెంపు
* విద్యుత్‌ వాహనాలపై జీఎస్టీని 12శాతం నుంచి 5శాతానికి తెచ్చే ఆలోచనలో ఉన్నాం.

* రూ.5లక్షల వరకు ఆదాయానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

* పన్నుల విధానంలో పారదర్శకత తీసుకొస్తాం. కార్పొరేట్‌ ట్యాక్స్‌ పరిధి రూ.400కోట్లకు పెంపు.

* దేశంలో మెగా మ్యానుఫ్యాక్చరింగ్‌ జోన్లు. బ్యాటరీ, సౌరశక్తి రంగంలో విదేశీ కంపెనీలకు అనుమతి

* రూ.1,రూ.2,రూ.5,రూ.10,రూ.20 కొత్త నాణేలు తీసుకొస్తాం! చూపు లేని వారు కూడా గుర్తించే విధంగా ఇవి ఉంటాయి.

* ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ. లక్షా ఐదు వేల కోట్ల ఉపసంహరణకు నిర్ణయం