ఆమె కొత్త లుక్’లో

ఆమె టీజర్ తోనే షాక్ ఇచ్చింది. ఒంటిపై ఒక్క నూలుపోగు కూడా లేకుండా న్యూడ్ గా కనిపించింది. అమలాపాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆడై’. తెలుగులో ‘ఆమె’గా తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. శనివారం ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అమలా డిపరెంట్ లుక్ లో కనిపించి ఆకట్టుకొంది. అమలా కొత్త లుక్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘ఆమె’ చిత్రానికి రత్న కుమార్ దర్శకత్వం వహించారు. లైంగికల్ వేధింపులు, రేప్ కేసు నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ప్రస్తుతం స్టార్, సీనియర్ హీరోయిన్లు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పిస్తున్నారు. హిట్స్ అందుకొంటున్నారు. అమలాపాల్ కూడా ఆమె తో అటు వైపుగా ట్రై చేస్తోంది. ఆమె హిట్ అయితే.. అమలా నుంచి మరిన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు రావొచ్చు. ఇక, ఆమె టీజర్ లో కనిపించిన న్యూడ్ షోకి సెన్సార్ బోర్డ్ కత్తెరపెట్టింది. ఏకంగా ఆమెకు ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఏ మేరకు సంతృప్తి పరుస్తుందన్నది ప్రశ్నగా మారింది. త్వరలోనే ఆమె ప్రేక్షకుల ముందుకు రానుంది.