అమిత్ షా హైదరాబాద్ టూర్ షెడ్యూల్ !

భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఇవాళ హైదరాబాద్ పర్యటనకి రానున్నారు. దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా షా నగరానికి వస్తున్నారు. మధ్యాహ్నం 2.40 గంటల నుంచి రాత్రి 8.40 వరకు.. ఆరు గంటల పాటు హైదరాబాద్ లో షా పర్యటన సాగనుంది.

అమిత్ షా హైదరాబాద్ టూర్ షెడ్యూల్ వివరాలు :

* మధ్యాహ్నం 2.40 గంటల హైదరాబాద్ చేరుకొనున్నారు

* విమానాశ్రయంలో తొలుత సీఐఎస్‌ఎఫ్‌ అధికారులతో సమావేశమవుతారు

* తర్వాత శంషాబాద్‌ సమీపంలో రంగానాయకుల తండాలోని గిరిజన మహిళ సోనినాయక్‌ ఇంటికి వెళ్లి ఆమెకు తొలి సభ్యత్వాన్ని ఇస్తారు

* సాయంత్రం 4.30 గంటలకు శంషాబాద్‌లోని కేఎల్‌సీసీ కన్వెన్షన్‌ హాల్‌కు చేరుకుంటారు

* రాత్రి 7 గంటలకు శంషాబాద్‌లోని నోవాటెల్‌కు చేరుకుని పార్టీ కోర్‌కమిటీ సమావేశంలో పాల్గొంటారు

* తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పార్టీ కోర్‌కమిటీ సమావేశంలో చర్చించనున్నారు

* నేతలతో కలిసి విందు భోజనం అనంతరం రాత్రి 8.40కి ఢిల్లీకి తిరుగుప్రయాణమవుతారు