హైదరాబాద్‌ పోలీసులకు అమితాబ్ ప్రశంస

హైదరాబాద్ లో కొత్త సిగ్నలింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. కూడళ్లలో జీబ్రా క్రాసింగ్స్‌ వెంట రంగులు మారే ఎల్‌ఈడీ లైట్లను అమర్చనున్నారు. ఇప్పటికే బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు సిగ్నల్స్ వద్ద వీటిని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. త్వరలోనే నగరంలో మొత్తం ఇలాంటి సిగ్నలింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. జీహెచ్ ఎంసీతో కలిసి హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులను ఈ కొత్త సిగ్నలింగ్ ని తీసుకొస్తున్నారు. ఈ కొత సిగ్నలింగ్ విధానంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

తాజాగా, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ హైదరాబాద్ కొత్త సిగ్నలింగ్ విధానంపై ప్రశంసలు కురుపించారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ప్రయత్నాన్ని మెచ్చుకొన్నారు. ‘ఇదో మంచి ఆలోచన. బాగా పని చేస్తుంది’ అని బిగ్ బీ ట్విట్ చేశారు. పాదచారులకు రోడ్లు దాటేందుకు ఈ సిగ్నల్స్ అనుకూలంగా ఉన్నాయి. అనలాగ్, డిజిటల్ ల్యాబ్ సహకారంతో ట్రాఫిక్ పోలీసులు వీటిని ఏర్పాటు చేశారు.