భారత్ సెమీస్ ప్రత్యర్థి ఎవరు ? తేలేది నేడే !
కోహ్లీసేన ఇప్పటికే ప్రపంచకప్ సెమీఫైనల్ కు చేరింది. ఇప్పుడు సెమీస్ లో టీమిండియా ఢీకొనబోయే జట్టు ఏది అనేది ఆసక్తిగా మారింది. పాయింట్ల పట్టికలో ఒకటో స్థానంలో నిలిచిన జట్టు.. నాల్గో స్థానంలో నిలిచిన జట్టుతో ఆడాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో టీమ్ఇండియా ఆఖరి లీగ్ సమరానికి సిద్ధమైంది. నేడు శ్రీలంకను ఢీకొట్టనుంది. 13 పాయింట్లతో ఉన్న భారత్‌కు అగ్రస్థానం దక్కాలంటే ఈ మ్యాచ్‌లో నెగ్గితేనే సరిపోదు. శనివారమే జరిగే మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (14 పాయింట్లు).. దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోవాలి. టీమిండియా అగ్రస్థానం సాధిస్తే.. న్యూజిలాండ్‌తో, రెండో స్థానంలో నిలిస్తే ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్లో ఆడుతుంది.
ఇక నేటి మ్యాచ్ విషయానికొస్తే.. పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశముంది. దీంతో భారత్ ఇద్దరు స్పిన్నర్లు చాహల్, కుల్దీప్లతో బరిలోకి దిగే అవకాశముంది. భువనేశ్వర్, షమిలలో ఒకరే జట్టులో ఉండొచ్చు. ధోనీని ఐదో స్థానం నుంచి నాల్గో స్థానంలో ఆడించే అవకాశం ఉంది.
WATCH: A day before the match & what's happening with #TeamIndia? @klrahul11 has all the details 🤔😎 – by @RajalArora
Watch the full video here ➡️👉▶️👉 https://t.co/K11RwJRm3S pic.twitter.com/rsjUHK7Cx6
— BCCI (@BCCI) July 5, 2019