లంకపై ఈజీ గెలుపు

ప్రపంచకప్ ఆఖరి లీగ్ మ్యాచ్ ని టీమిండియా ఘనంగా ముగించింది. శ్రీలంకని 7వికెట్ల తేడాతో ఈజీగా గెలుపొందింది. టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. మాథ్యూస్‌ (113; 128బంతుల్లో 10×4, 2×6) శతకం బాదాడు. తిరుమన్నె(53; 68బంతుల్లో 4×4) రాణించాడు. ఈ మ్యాచ్ తో వంద వికెట్ల క్లబ్ లో చేరిన బుమ్రా 3 వికెట్లు పడగొట్టాడు.

అనంతరం 265 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఆడుతూపాడుతూ చేధించింది. ఓపెనర్లలిద్దరూ రోహిత్‌(103; 94బంతుల్లో 14×4, 2×6), కేఎల్‌ రాహుల్‌(111; 118బంతుల్లో 11×4, 1×6) శతకాలతో చెలరేగడగంతో.. భారత్‌ 43.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ప్రపంచకప్ లో రోహిత్ కిది ఐదో శతకం. మొత్తం ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు సచిన్‌ (6) సరసన నిలిచాడు. ఈ టోర్నీలో మొత్తం ఐదు సెంచరీలు నమోదు చేసిన రోహిత్‌ 647 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఈ విజయంతో టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 9మ్యాచ్ లు ఆడిన టీమిండియా 15పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ ఫలితం అనంతరం లీగ్ దశలో టీమిండియా అగ్రస్థానంలో నిలుస్తుందా ? రెండో స్థానానికి పరిమితం అవుతుందా ? అన్నది తేలనుంది.