‘ఓ బేబీ’ తొలిరోజే రికార్డు కలెక్షన్స్


ఓ ప్రయోగం సక్సెస్ అయితే.. దాని క్రేజ్ యే వేరు. 70యేళ్ల బామ్మ 23యేళ్ల యువతిగా మారతే.. అద్భుతమే. ఆ అద్భుతాన్ని తెరపైకి తీసుకొచ్చింది దర్శకురాలు నందినిరెడ్డి. ఆమె దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఓ బేబీ’. శుక్రవారం
ప్రేక్షకుల ‘ఓ బేబీ’ హిట్ టాక్ సొంతం చేసుకొంది. నందినిరెడ్డి దర్శకత్వ ప్రతిభ, సమంత నటనకి ప్రశంసలు కురుస్తున్నాయి.

సినిమా ఫ్యామిలీ, యూత్.. అన్నీ వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొనేలా ఉంది. వినోదం, ఎమోషన్స్ బాగా పండాయి. ఈ నేపథ్యంలో తొలిరోజు ఓ బేబీ కలెక్షన్స్ అదిరిపోయాయి. యుఎస్ లో 93 లొకేషన్స్ లో విడుదలైన ఓ బేబీ ప్రీమియర్ షోస్ ద్వారా 1, 45, 637 డాలర్లను వసూలు చేసింది. హీరోయిన్ ఓరియెంటెడ్ తెలుగు సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్స్ సాధించడం ఇదే తొలిసారి.

తెలుగు రాష్ట్రాల్లోనూ ‘ఓ బేబీ’ తొలిరోజే హవా చూపించింది. రూ. కోటి వరకు షేర్ ని రాబట్టింది. అత్యధికంగా నైజాం నుంచి రూ. 44 లక్షలు వసూలు చేసింది. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో వీకెండ్ కలెక్షన్స్ అదిరిపోయేలా ఉన్నాయి. పోటీలో మరో సినిమా లేకపోవడం ఓ బేబీ కి బాగా కలిసొచ్చేలా ఉంది. వినోదం పండిన ఏ సినిమా లెక్క తప్పదు. సంక్రాంతికి నవ్వులు పూయించిన ‘ఎఫ్ 2’ ఏకంగా రూ. 100కోట్లకిపైగా కలెక్ట్ చేసింది. అదే దారిలో ఓ బేబీ కలెక్షన్స్ కూడా రూ. 100కోట్లు దాటిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదేమో.. !