అబ్బా.. అనుష్కని మొత్తం చూపించలె.. !


స్వీటీ అనుష్క ఎంత సన్నబడింది.. ఆమె న్యూలుక్ ఎలా ఉంది ? చూద్దామని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఐతే, స్వీటీ మాత్రం భాగమతి తర్వాత పెద్దగా బయట కనిపించడం లేదు. పైగా భాగమతి తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని బరువు తగ్గే పనిలో పడింది. ఇందుకోసం శాస్త్రీయ ఆర్వేధిక్ పద్దతిని ఫాలో అయినట్టు వార్తలొచ్చాయ్. ఈ నేపథ్యంలో స్వీటీ కొత్త లుక్ ని చూసేందుకు ఆమె అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం ‘నిశ్శబ్ధం’ సినిమాతో బిజీగా ఉన్న అనుష్క. సినిమా షూటింగ్ స్పాట్ లో చిత్రబృందంతో కలిసి దిగిన ఫోటోలు బయటికొచ్చాయ్. ఇందులో స్వీటీ మొహాన్ని మాత్రమే చూపించింది. ఆమె కంప్లీట్ బాడీని చూపించలేదు. దీంతో ఆమె అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఐతే, స్వీటీ మొహం మాత్రం మెరిసిపోతుంది. ఫేస్ చూస్తే బాగా సన్నబడినట్టు కనిస్తుంది. ఎంత సన్నిబడింది ? అన్నది మాత్రం నిశ్శబ్దం ఫస్ట్ లుక్ తోనే తెలియనుంది.

‘నిశ్శబ్దం’ చిత్రానికి హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. థ్రిల్లర్‌ కథాంశంతో దీన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో అనుష్క పాత్ర అరుంధతి, బాహుబలి సినిమాలోని పాత్రని మించేలా ఉండనుందట. సరికొత్త లుక్ లో కనిపించనుందని చెబుతున్నారు. స్వీటికి జంటగా మాధ‌వ‌న్ కనిపించబోతున్నారు.