‘బ్రోచేవారెవరురా’ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్


మొదటి ఆటతోనే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వినిపించిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. కలెక్షన్స్ ఆ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా జూన్ 28న విడుదలైంది. ఇప్పటి వరకు రూ. 15కోట్ల కలెక్షన్స్ ని క్రాస్ చేసింది. ఇంకా కలెక్షన్స్ నిలకడగా ఉన్నాయి. ‘బ్రోచేవారెవరురా’ సినిమాకు ముందు వారం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’, తర్వాత వారం ‘ఓ బేబీ’ సినిమాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు హిట్ టాక్ ని సొంతం చేసుకొన్నాయి. ఆ పోటీని తట్టుకొంటూ బ్రోచేవారెవరురా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సొంతం చేసుకోవడం విశేషం.

వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో ‘బ్రోచేవారెవరురా’ తెరకెక్కింది. శ్రీవిష్ణు, నివేదా ధామస్‌, నివేదా పేతురాజ్‌,
ప్రియదర్శిని, రాహుల్ రామకృష్ణ.. కీలక పాత్రలో నటించారు. సినిమాని పూర్తి వినోదాత్మకంగా నడిపించి ప్రశంసలు అందుకొన్నాడు వివేక్ ఆత్రేయ. థ్రిల్లింగ్ సన్నివేశాలని కామెడీ టచ్ లో ప్రజెంట్ చేయడం విశేషం.