కన్నీళ్లు పెట్టుకొన్న విజయ్ దేవరకొండ
రౌడీ హీరో విజయ్ దేవరకొండ గుండెల్ని పిండేశాడు. తమ్ముడు ఆనంద్ దేవరకొండపై ఉన్న ప్రేమని కన్నీళ్ల రూపంలో బయటికొచ్చింది. ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం కాబోతున్న చిత్రం ‘దొరసాని’. సీనియర్ నటుడు రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక హీరోయిన్ గా నటిస్తున్నారు. కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు. ఈ నెల 12న దొరసాని ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరబాద్ లో దొరసాని ప్రీ-రిలీజ్ వేడుకని ఘనంగా నిర్వహించారు. యంగ్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇన్నాళ్లు ‘దొరసాని’పై విజయ్ ఒక్క మాట్లాడకపోవడం, ప్రమోట్ చేయకపోవడం, తమ్ముడి సినిమాని అస్సలు పట్టించుకోకపోవడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర వివర్శలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్ ఏం మాట్లాడతాడు ? తమ్ముడు సినిమాని గురించి ఏం చెబుతాడు ?? అనే ఆసక్తి నెలకొంది. ఐతే, విజయ్ తన శైలికి భిన్నంగా.. ఎమోషనల్ గా మాట్లాడారు. ఫ్యామిలీ, తమ్ముడి గురించి చెబుతూ స్టేజ్ మీదనే కన్నీళ్లు పెట్టుకొన్నాడు. మొత్తంగా తమ్ముడు ఆనంద్ పై ఉన్న ప్రేమ విజయ్ కళ్లలో కనిపించింది.