ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా ధోని.. !


గొప్ప నాయకుడు అనిపించుకొన్నాడు మహేంద్ర సింగ్ ధోని. టీమిండియాకు రెండు ప్రపంచకప్ (వన్డే, టీ20)లు సాధించిపెట్టాడు. అంతకుమించి వ్యక్తిత్వంతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాడు. ఐతే, ఇటీవల ధోని రిటైర్మెంట్ పై జోరుగా ప్రచారం జరుగుతోంది. వరల్డ్ కప్ ముగియగానే ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తారని చెప్పుకొంటున్నారు.

రిటైర్మెంట్ తర్వాత ధోని ఏం చేయబోతున్నాడు ? అంటే రాజకీయాల్లోకి రాబోతున్నాడని సంచలన కథనం ప్రచురించింది సండే గార్డియన్ అనే పత్రిక. ఆ కథనం ప్రకారం ఆటకు గుడ్ బై చెప్పిన వెంటనే ధోని భాజాపాలో చేరబోతున్నాడు. అక్టోబర్ లో జరగనున్న ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు ఓ బీజేపీ సీనియర్ నేతకు ధోని మాటిచ్చినట్టు సండే గార్డియన్ పత్రిక పేర్కొంది.

ఝార్ఖండ్ బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోంది. రఘుబర్ దాస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఐతే, దాస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ధోనిని బరిలోకి దింపి.. మళ్లీ అధికారంలోకి రావాలనే ప్లాన్ లో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజలు ధోనిని దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తరహా ధోని కూడా ముందు ముఖ్యమంత్రిగా అనుభం గడించి ఆ తర్వాత ప్రధాని పదవి కోసం పోటీ పడతారేమో చూడాలి.