సెమీ ఫైనల్’లో వర్షం పడినా టీమిండియా సేఫ్ !
ప్రపంచకప్ లో వరుణుడు శ్రీలంక, పాకిస్థాన్ జట్ల సెమీస్ అవకాశాలని దెబ్బతీసిన సంగతి తెలిసిందే. వర్షం కారణంగా శ్రీలంక రెండు, పాకిస్థాన్ ఒక మ్యాచ్ ని కోల్పోయాయి. పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ తో సమానంగా పాకిస్థాన్ 11 పాయింట్లు కలిగియున్న రన్ రేటు కారణంగా సెమీస్ కు చేరలేకపోయింది. ఒకవేళ వర్షం కారణంగా పాక్ ఒక మ్యాచ్ ని కోల్పోకపోతే సెమీస్ కు చేరేదేమో.. ! శ్రీలంక కూడా అంతే. ఐతే, ఇప్పుడు సెమీస్ మ్యాచ్ లకి వరుణుడు అడ్డుపడితే ఏంటీ పరిస్థితి అన్న చర్చ సాగుతోంది.
లీగ్ మ్యాచ్ ల మాదిరిగా కాకుండా సెమీస్, ఫైనల్ మ్యాచ్ లకు వర్షం పడినా రిజర్వ్ డే ఉంటుంది. మ్యాచ్ రోజు వర్షంతో ఆట సాధ్యంకాకపోతే.. మరుసటి రోజు మ్యాచ్‌ని నిర్వహిస్తారు. రెండ్రోజులు కూడా కనీసం 20ఓవర్ల ఆట సాధ్యంకానీ యెడల రన్ రేటు అధికంగా ఉన్న జట్టు ఫైనల్ కి చేరుతుంది. న్యూజిలాండ్ కంటే భారత్ రన్ రేటు ఎక్కువగా ఉన్న కారణంగా వర్షం పడినా.. టీమిండియా సేప్ నే. ఫైనల్ కు చేరుతుంది.
ఇక, మంగళవారం తొలి సెమీ ఫైనల్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య, గురువారం రెండో సెమీ ఫైనల్ ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనుంది.