‘సాహో’ సాంగ్ అదిరిపోయింది.. !

‘సాహో’ సందడి మొదలైపోయింది. ‘బాహుబలి’ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సాహో’. ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా ప్రచార చిత్రాలున్నాయి. సాహో మేకింగ్ వీడియోస్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. టీజర్ ఏకంగా చరిత్ర సృష్టించింది. అత్యధిక వ్యూస్ సొంతం చేసుకొన్న భారతీయ సినిమాగా రికార్డులకెక్కింది. సాహో తొలి పాట టీజర్ కు అదే రేంజ్ రెస్పాన్స్ ని చూశాం.

ఇప్పుడు సాహో ఫస్ట్ సాంగ్ #PsychoSaiyaan వచ్చేసింది. ఇందులో శ్రద్దా కపూర్ హాట్ హాట్ లుక్స్ తో అదరగొట్టేసింది. ప్రభాస్-శ్రద్దా ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఐతే, ఈ సాంగ్ ట్యూన్ తెలుగు ప్రేక్షకులకి ఎక్కడం కష్టమే. బాలీవుడ్ జనాలకి మాత్రమే #PsychoSaiyaan నచ్చేలా ఉంది. ఇక, సాంగ్ చివర్లో టీజర్ లోని హైలైట్ బిట్ సీన్స్ ని జోడించారు.

సాహో చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. పలువురు బాలీవుడ్, హాలీవుడ్ టెక్నిషన్స్, నటీనటులు సాహో కోసం పని చేస్తున్నారు. దాదాపు రూ. 300కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఆగస్టు 15న సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది.