విజయ్ పై రాజశేఖర్ సటైర్
సీనియర్ నటుడు రాజశేఖర్ యంగ్ హీరో విజయ్ దేవరకొండపై వేసిన సటైర్ ఆకట్టుకుంటోంది. ఆదివారం హైదరాబాద్ లో ‘దొరసాని’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజయ్ మాట్లాడుతూ.. ‘తమ్ముడు హీరో అవ్వడం తనకి ఇష్టం లేదు. సినిమా కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. అందుకే దొరసానికి సపోర్ట్ చేయలేదు. చీఫ్ గెస్ట్ గా రమ్మని అడిగినప్పుడు కూడా.. ముందుగా సినిమా చూపించమని కండీషన్ పెట్టా. సినిమా నచ్చకపోతే రాకపోతుండే’ అన్నట్టుగా మాట్లాడారు.
ఆ తర్వాత రాజశేఖర్ మాట్లాడిన సందర్భంలో.. విజయ్ మాటలకి కౌంటర్ ఇచ్చినట్టు అనిపించింది. ఇందాక విజయ్ అన్నాడు.. ముందుగా సినిమా చూపించండి. నచ్చకపోతే.. మీరు వేరే వారిని చీఫ్ గెస్ట్ గా పిలుచుకొనే వీలుంటుందని.. కానీ నాకు ఆ ఆప్షన్ లేదు. సినిమా ఎలా ఉన్నా రావాల్సిందే అన్నారు. ఆ మాటలకి విజయ్ మొహం కాస్త చిన్న బుచ్చుకొన్నట్టు అనిపించింది. ఎందుకంటే ? తమ్ముడు సినిమాని విజయ్ పట్టించుకోవట్లేదనే విమర్శలొస్తున్నాయ్. సినిమాలో మేటర్ ఉంటే మనోడు. లేకుంటే కాదు అన్నట్టు విజయ్ వ్యవహార శైలి ఉందనే గుసగుసలు వినిపించాయ్. ఈ నేపథ్యంలోనే విజయ్ కు రాజశేఖర్ మాటలు సటైర్ లా అనిపించాయని చెప్పవచ్చు.