బెల్లకొండ సాహాసం చూశారా ?

హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా యువ హీరో బెల్లకొండ శ్రీనివాస్ వరుసగా సినిమాలైతే చేస్తున్నాడు. ఐతే, ఇప్పటి వరకు ఆయన ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్ పడలేదు. మాస్ హీరోకు ఉండాల్సిన అన్ని లక్షణాలు బెల్లకొండలో ఉన్నాయి. కానీ, సరైన కథ పడటం లేదు. ‘సీత’ సినిమాతో కాస్త భిన్నంగా ట్రై చేశాడు. అదీ వర్కవుట్ కాలేదు.

ప్రస్తుతం ‘రాక్షసుడు’ సినిమా చేస్తున్నాడు. తమిళ్ ‘రాట్ససన్’ కు రీమేక్ ఇది. రమేశ్ వర్మ దర్శకుడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. ఈ సినిమా రెడీ అయిపోయింది. కానీ సరైన డేట్ కోసం నిరీక్షిస్తోంది. సినిమాల విషయం పక్కనపెడితే.. బెల్లకొండ చేసిన ఓ సాహాసం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ పెద్ద భవనంలో హ్యాండ్స్ స్టాండ్ చేశాడు శ్రీనివాస్. అది చూడ్డానికి థ్రిల్లింగ్ ఉంది. అది మీరు ఓ సారి చూసేయండీ.. !