నాని లవ్వర్ గా అనుపమ


శివ నిర్వాణ దర్శకత్వంలో నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘నినుకోరి’. సూపర్ హిట్ అయింది. ఇందులో నాని లవ్వర్ గా నివేదా నటించింది. ఆమె భర్త పాత్రలో ఆది కనిపించారు. గుండెల్ని పిండేసే కథనంతో ఎమోషనల్ లవ్ స్టోరీగా డీల్ చేశాడు శివ నిర్వాణ. ఇప్పుడీ సినిమా తమిళ్ లో రిమేక్ కానుంది.

నాని నటించిన పాత్రలో అథర్వా నటించనున్నాడు. హీరోయిన్ గా మాతృక హీరోయిన్ నివేదాని తీసుకొందామని ట్రై చేశారు. కానీ, కుదరలేదు. ఫైనల్ గా అనుపమ పరమేశ్వరన్ ఫిక్సయింది. ఇక ఆది పినిశెట్టి పాత్రలో ఎవరు నటిస్తారన్నది తెలియాల్సి ఉంది. మళ్లీ ఆదిని తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళ్ ‘నిన్నుకోరి’ సినిమాలో ఫస్టాఫ్, క్లైమాక్స్ సన్నివేశాల్లో మార్పులు చేయబోతున్నట్టు తెలిసింది.