టీమిండియాకు 20 ఓవర్ల టార్గెట్ ?
ప్రపంచకప్ లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న సెమీస్ మ్యాచ్ కు వర్షం అడ్డుపడిన సంగతి తెలిసిందే. ఐతే, భారీ వర్షం పడటం లేదు. ముసురు పడుతోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ను నిర్వహించేందుకే ఐసీసీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పిచ్‌పై నాలుగు వైపులా కవర్లు కప్పారు. భారత్‌ను కనీసం 20 ఓవర్లైనా ఆడించేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం.
అదీ కుదరకపోతే రిజర్వు రోజున నిర్వహిస్తారు. అంటే రేపు మళ్లీ మ్యాచ్ నిర్వహిస్తారు. రేపు కూడా వర్షం అడ్డుపడి.. ఆట సాధ్యం కాకపోతే లీగ్ దశలో రన్ రేటు అధికంగా ఉన్న టీమిండియా ఫైనల్ కి చేరుతుంది. ఇక, ఆట ఆగిపోయే సమయానికి కివీస్ 211/5తో ఉంది. రాస్ టేలర్ (67; 85 బంతుల్లో 3×4, 1×6), టామ్ లేథమ్ (3; 4 బంతుల్లో) క్రీజులో ఉన్నారు.