పవన్’ని మోసం చేసిన ముద్రగడ !

ఆంధ్రప్రదేష్ రాజకీయాలు ‘కాపు వర్సెస్ కమ్మ’గా సాగుతాయన్న సంగతి తెలిసిందే. ఐతే, ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాపు, కమ్మ, రెడ్డి.. అందరూ జగన్ వైపు మొగ్గుచూపారు. బరిలో కాపు నేత పవన్ కల్యాణ్ ఉన్న పట్టించుకోలేదు. జగన్ పైనే నమ్మకం ఉంచారు. ఆయనికి ఘన విజయాన్ని కట్టబెట్టారు. ఇప్పుడిదే విషయాన్ని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం గుర్తు చేశారు. తాజాగా ముద్రగడ సీఎం జగన్ కి లేఖ రాశారు.

కాపు కులానికి న్యాయం చేయాలని లేఖలో కోరారు. మాజీ సీఎం చంద్రబాబు అసంపూర్ణంగా వదిలేసిన కాపు రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాపు కులానికి చెందిన పార్టీని (జనసేన) కూడా కాదని తమ కులమంతా వైసీపీకే ఓటు వేశారని గుర్తుచేశారు. కాపు జాతికి మీ ప్రభుత్వం న్యాయం చేయగలదని నమ్ముతున్నామన్నారు. దీనిపై సీఎం జగన్ ఏం సమాధానం ఇస్తారన్నది ఆసక్తిగా మారింది.

మరోవైపు, ఈ లేఖతో ముద్రగడ పవన్ కల్యాణ్ కి అన్యాయం చేశారనే విషయం తేటతెల్లం అయింది. ముద్రగడ, కాపు కులస్తులు పవన్ ని పట్టించుకోకపోవడానికి కూడా బలమైన కారణం ఉంది. పవన్ కాపు ఉద్యమానికి మద్దతు ప్రకటించడానికి నిరాకరించారు. స్వయంగా ముద్రగడ వెళ్లి అడిగిన నో చెప్పారు. తాను కుల, మతాలకి అతీతంగా రాజకీయాలు చేస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కాపులు పవన్ కంటే జగన్ నే నమ్మారు. ఆయన్ని గెలిపించారు.