అవంతిక చాలా ముదురు పాప

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కింగ్ నాగార్జునతో రొమాన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మన్మథుడు2. ఇప్పటికే ఈ సినిమా టీజర్ వచ్చేసింది. ఐతే, టీజర్ లో కలర్ మిస్సయింది. కేవలం నాగ్ పైనే టీజర్ ని కట్ చేశారు. రకుల్ ని చూపించలేదు. ఆమె స్పెషల్ గా కట్ చేసిన టీజర్ ని తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో రకుల్ వన్ ఉమెన్ షో చేసింది.

అవంతికగా ముదురు పాపలా కనిపిస్తోంది. ముందు పద్దతిగా కనిపించి.. ఆ తర్వాత బోల్డ్ గా మారిపోయింది. షర్ట్ బటన్స్ విప్పేసి హీటిక్కించే ప్రయత్నం చేసింది. దమ్ముకొట్టింది. ఇప్పటి వరకు ‘యు’ సర్టిఫికెట్ కు ప్రయతించా.. ఇక ‘ఎ’ సర్టిఫికెట్ చూపిస్తానని గ్లామర్ షో తో అదరగొట్టేసింది. టీజర్ లోనే అవంతిక ఈ రేంజ్ లో ఉంటే.. సినిమాలో ఇంకే రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఆగస్టు 9న మన్మథుడు2 ప్రేక్షకుల ముందుకు రానుంది.