రోహిత్ భీకర ఫామ్ వెనక యువరాజ్ !


వరల్డ్ కప్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మని ని ఏదో శక్తి ఆవహించినట్టు ఉంది. సింగిల్స్ తీసినంత ఈజీగా సెంచరీలు బాదేస్తున్నాడు. ఇప్పటికే ఐదు సెంచరీలు బాదేశాడు. ఐతే, తనని ఆవహించిన శక్తి యువరాజ్ సింగ్ అని చెప్పేశాడు రోహిత్. సెమీస్ లో న్యూజిలాండ్ మ్యాచ్ కి ముందు రోహిత్ మీడియాతో మాట్లాడారు. ఐపీఎల్ సందర్భంగా యువరాజ్ విలువైన సలహాలు ఇచ్చాడు.

ఐపీఎల్ లో 40, 50 పరుగులకే అవుటయ్యేవాణ్ని. అప్పుడు యువీ మంచి సలహా ఇచ్చారు. 2011 వరల్డ్ కప్ కి ముందు యువీ కూడా ఫామ్ లో లేడు. కానీ, ఆ వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణించాడు. కొద్దిగా ఓపికతో ఆడమని చెప్పాడు. అది బాగా వర్కవుట్ అవుతుందని తెలిపారు. రోహిత్ యువీ గురించి చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.