చైతూని అక్కడ దాచుకొంది
భర్త నాగచైతన్యపై ఉన్న ప్రేమను సమంత పక్కటెముకల వద్ద దాచుకొంది. అదేంటీ ? ప్రేమని గుండెల్లో దాచుకొంటారు కదా.. ! సామ్ కాస్త భిన్నంగా ట్రై చేసింది. ఆమె కుడివైపు పక్కటెముకల వద్ద భర్త నాగ చైతన్య పేరుని టాటుగా వేయించుకొంది. సోమవారం ‘ఓ బేబీ’ సక్సెస్ మీట్ సందర్భంగా ఫోటోలకి పోజులిస్తున్న సమయంలో సామ్ సీక్రెట్ టాటూ బయటపడింది. ఇక చేసేమీ లేక.. తన సీక్రెట్ టాటూ గురించి అభిమానులకి చెప్పేసింది.
సీక్రెట్ టాటూ బయటపడిన ఫోటో ఒకటి సామ్ తన ఇన్ స్ట్రో గ్రామ్ లో పోస్ట్ చేసింది. “చాలా ఉత్తమమైన, ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నా. నేను రహస్యంగా ఉంచిన ఒకే ఒక్క టాటూ చివరికి బయటపడింది. నాగచైతన్య.. నా భర్త, నా ప్రపంచం” అంటూ రాసుకొచ్చింది. ఇక, గత యేడాది వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకొన్న సామ్.. ఈ యేడాది కూడా హిట్ ట్రాక్ ని కొనసాగిస్తోంది. ఈ యేడాది మజిలీ, ఓ బేబీ చిత్రాలతో విజయాలు అందుకొంది. గత శుక్రవారం విడుదలైన ఓ బేబీ కేవలం 4రోజుల్లోనే రూ. 17కోట్లు వసూలు చేసింది.