‘బంగార్రాజు’పై బిగ్ బాస్ ఎఫెక్ట్
‘బంగార్రాజు’కు అస్సలు టైం కలిసిరావడం లేదు. ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమా పూర్తయిన వెంటనే ‘బంగార్రాజు’ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాలో బంగార్రాజు పాత్ర బాగా పేలింది. ఆ పాత్రని బేస్ చేసుకొని ఓ కథని రెడీ చేయమని దర్శకుడు కల్యాణ్ కృష్ణ కోరాడు నాగ్. ఆయన బంగార్రాజు స్క్రిప్టుని రెడీ చేయడం, మధ్యలో నాగ్ వేరే సినిమాలు అంగీకరించడంతో.. ఇన్నాళ్లకు బంగార్రాజుకి టైం వచ్చింది.
ప్రస్తుతం నాగ్ ‘మన్మథుడు2’తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తవ్వగానే బంగార్రాజుని సెట్స్ మీదకు తీసుకెళ్లాలనే టార్గెట్ పెట్టుకొన్నాడు నాగ్. ఐతే, ఈసారి బంగార్రాజుపై బిగ్ బాస్ ఎఫెక్ట్ పడనుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 కోసం నాగ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగా బంగార్రాజు మరింత ఆలస్యం అయ్యేలా ఉంది.
ఇక, బంగార్రాజులో నాగ్ – రమ్యకృష్ణ జంటగా నటించనున్నారు. నాగ చైతన్య కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమాలో చైతూ నాగ్ మనవడిగా కనిపించబోతున్నాడు. వాస్తవానికి బంగార్రాజుని వచ్చే యేడాది సంక్రాంత్రికి తీసుకొద్దామని అనుకొన్నారు. బిగ్ బాస్ ఎఫెక్ట్ అది సాధ్యం అయ్యేలా లేదు. ఇక బంగార్రాజు టార్గెట్ సమ్మర్ అనే చెప్పాలి.