మెగాస్టార్ సినిమాని లైట్ తీసుకోవడం ఏంటీ ?

త్రివిక్రమ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే అభిమానులు మురిసిపోయారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అతిథి పాత్రలో కనిపిస్తారని కూడా ఆశపడ్డారు. ఎందుకంటే ? త్రివిక్రమ్ అడిగితే పవన్ కాదనడు అని అభిమానుల నమ్మకం. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ – మెగాస్టార్ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు. వచ్చే యేడాది సంక్రాంతికి రిలీజ్ గా టార్గెట్ పెట్టుకొన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే యేడాది త్రివిక్రమ్-మెగాస్టార్ సినిమా ఉంటుంది. బన్నీ సినిమా తర్వాత త్రివిక్రమ్ చిరుని సినిమానే సెట్స్ మీదకు తీసుకెళ్తారని అందరూ భావించారు. కానీ, త్రివిక్రమ్ మెగాస్టార్ సినిమాని అసలు పరిగణలోనికి తీసుకొన్నట్టు కనిపించడం లేదు. ఆయన తదుపరి సినిమా ఎన్టీఆర్’తో దాదాపు ఖాయమైంది.

ఆ తర్వాత త్రివిక్రమ్ కోసం వెంకటేష్, మహేష్ బాబు రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ – మెగాస్టార్ సినిమా ఇక లేనట్టేననే ప్రచారం జరుగుతోంది. ఐతే, మెగాస్టార్ సినిమాని త్రివిక్రమ్ లైట్ తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. బహుశా.. కొరటాల-మెగాస్టార్ సినిమా పూర్తయ్యేలోపు త్రివిక్రమ్ తారక్ తో సినిమాని పూర్తి చేసి వస్తాడేమో చూడాలి.