బన్నీని ఆమెని నమ్ముకొంటాడా ?
బద్రీనాథ్ సినిమాలో హీరోయిన్ తమన్నా పాత్ర పేరు అలకనంద. ఇప్పుడు ఆ పేరునే బన్నీ19వ సినిమా టైటిల్ కాబోతుందనే ప్రచారం జరుగుతోంది. బన్నీ19వ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లింది. జెడ్ స్వీడుతో షూటింగ్ జరుపుకుంటోంది. సంక్రాంతికి రిలీజ్ డేటు ప్రకటించేశారు. దీంతో మహేష్, బన్నీల మధ్య సంక్రాంతి ఫైట్ ఫిక్సయింది.
ఈ విషయం పక్కనపెడితే.. బన్నీ19వ సినిమా టైటిల్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సినిమా కోసం ‘నాన్న.. నేను’. ‘అలకనంద’ టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తరహా ఇది కూడా ఫాదర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతోన్న సినిమా. అందుకే నాన్న..నేను టైటిల్ పెట్టబోతున్నారనే కామెంట్స్ వినిపించాయ్. ఇప్పుడు అలకనంద టైటిల్ తెరపైకి వచ్చే సరికి.. మహిళా ప్రాధాన్యం, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనిపిస్తోంది. మహిళా ప్రాధాన్యం ఉన్న టైటిల్స్ ఎక్కువగా వెంకటేష్ సినిమాలకి చూశాం. ఇప్పుడు బన్నీ కూడా ఆడవాళ్లని నమ్ముకొనేలా ఉన్నాడు.
ఈ చిత్రంలో బన్నీకి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. సుశాంత్, నవదీప్ లకి మంచి పాత్రలు దక్కాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక & హాసినీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.