గుడ్ న్యూస్ : గ్రీన్‌కార్డు బిల్లుకు అమెరికా కాంగ్రెస్‌ ఆమోదం


గ్రీన్‌కార్డు బిల్లుకు అమెరికా కాంగ్రెస్‌ బుధవారం ఆమోదం తెలిపింది. ఒక్కో దేశానికి గరిష్ఠంగా ఏడు శాతానికి మించి గ్రీన్‌ కార్డులు ఇవ్వకూడదన్న నిబంధనలు ప్రవాస భారతీయులకు కష్టాలు తెచ్చిపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కోటా పరిమితిని ఎత్తేయాలని కోరుతూ సెనెట్‌లో ప్రవేశపెట్టిన బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.

ఈ బిల్లు ఆమోదంతో భారతీయులకు మేలు జరుగుతుంది. ప్రస్తుత విధానం ప్రకారం భారతీయుల దరఖాస్తులన్నీ ఆమోదం పొందాలంటే కనీసం 70 ఏళ్లు పడుతుందని అంచనా. తాజా బిల్లులు చట్టరూపం దాల్చడంతో గ్రీన్‌కార్డుల కోసం వారి నిరీక్షణ సమయం గణనీయంగా తగ్గుతుంది.