ధోని రిటైర్మెంట్‌ ప్రకటన ఎప్పుడంటే ?

ధోని రిటైర్మెంట్‌ ప్రకటించడం ఇక లాంఛనమే కావచ్చు. 38 ఏళ్ల ధోని ప్రపంచకప్‌ కోసమే జట్టులో ఉన్నాడు. మరోసారి ప్రపంచకప్ ని ముద్దాడిన తర్వాత.. మహి ఘనంగా వీడ్కోలు తీసుకోవాలని ఆశించారు అభిమానులు. కానీ సెమీస్‌తో భారత్‌ కథ ముగిసింది. రిటైర్మెంట్‌ పై ధోని ఇంకా ఏమీ చెప్పలేదు. కానీ.. ప్రకటించడం లాంఛనమే కావచ్చనే ప్రచారం జరుగుతోంది.

గతంలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొన్నప్పుడు ధోని సడెన్ గా ప్రకటన చేసి.. అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ తరహాలోనే రిటైర్మెంట్ పై ధోని నుంచి సడెన్ షాక్ తప్పదనే ప్రచారం జరుగుతోంది. వరల్డ్ కప్ లో ధోని ఆట తీరుపై విమర్శలొచ్చాయ్. ధోని మునుపటిలా వేగంగా ఆడలేకపోతున్నాడు. ఇంగ్లాండ్ తో ఓటమికి ధోనియే కారణమనే ప్రచారం జరిగింది. సెమీ ఫైనల్ లో ధోని రన్ అవుట్ కాకుండా మ్యాచ్ గెలిచేవాళ్లమని కెప్టెన్ కోహ్లీ కూడా అన్నారు.

మొత్తంగా.. ధోని కెరీర్ ముగింపు దశలో ఉంది. అది 10రోజుల్లో ముగుస్తుందా ? నెలరోజుల్లోనా ? అన్నది చెప్పలేమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. బుధవారం జరిగిన సెమీ ఫైనల్ నే ధోని చివరి మ్యాచ్ ఐతే.. ఆయన ఆడిన మొదటి వన్డే మరియు చివరి వన్డేలో రన్ అవుట్ కావడం విశేషం.