వైరల్ : అక్కడ నోట్ల వర్షం కురిసింది (వీడియో)

అమెరికాలోని జార్జియా రాష్ట్ర రాజధాని అట్లాంటాలో నోట్ల వర్షం కురిసింది. రోడ్లపై పడిన నోట్లని అక్కడి ప్రజలు ఏరుకోవడం మొదలెట్టారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అసలు ఏం జరిగిందంటే ? బుధవారం రాత్రి అట్లాంటాలో ఒక ఆర్మీ ట్రక్‌ సూమారు కోటీ పదిలక్షల రూపాయలను తీసుకెళుతోంది. ఆ సందర్భంలో ఒక్కసారిగా ఆ వాహన తలుపు తెరుచుకోవడంతో ఆ డబ్బంతా బయటకు వచ్చేసింది. అదే సమయంలో బాగా గాలి వీచడంతో ఆ దృశ్యం డబ్బులవానలా మారింది. ఆ మార్గం గుండా పోయే వాహనదారులు దిగి ఆ డబ్బు ఏరుకున్నారు. ఆ వీడియో వైరల్ అయింది.