దొరసాని.. ఒక చరిత్ర !
‘దొరసాని’ థియేటర్స్ లోకి వచ్చేసింది. సీనియర్ నటుడు రాజశేఖర్ కుమార్తె శివాత్మిక టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రమిది. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించారు. శివాత్మిక, ఆనంద్ దేవరకొండ.. ఇద్దరికీ ఇదే తొలి చిత్రం. టీజర్, ట్రైలర్ లతో ‘దొరసాని’ ప్రేమకథ ఆకర్షించింది. మరీ.. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన దొరసాని ప్రేక్షకులని సంతృప్తి పరిచిందా ? దొరసానిపై పబ్లిక్ టాక్ పై ఓ లుక్ వేద్దాం పదండీ.. !
సెంట్రల్ జైల్ సన్నివేశంతో సినిమా మొదలైంది. జైలు నుండి విడుదలైన కిషోర్ తన మిత్రుడు రాజు (ఆనంద్ దేవరకొండ) కోసం వెతుకులాట మొదలుపెడతాడు. ఈ క్రమంలో కిషోర్ తన 30ఏళ్ల క్రితం జరిగిన రాజు, దేవకీ ల ప్రేమకథను చెప్పడంతో దొరసాని ప్రేమకథ మొదలవుతుంది. దొరసానిగా శివాత్మిక, రాజుగా ఆనంద్ దేవరకొండ ఒదిగిపోయారు. ప్రేక్షకులని ఆ కాలంలో తీసుకెళ్లారు. తమ ప్రేమకథతో కలిసి ప్రయాణం చేసేలా చేశారు.
దర్శకుడు రాజు, దేవకీల ప్రేమకథని మాత్రమే చెప్పలేడు. ఆనాటి తెలంగాణ పరిస్థితులు, దొరస్వామ్య తెలంగాణా సమాజం,సామాన్య ప్రజలపై దొరల ఆధిపత్యాన్ని కళ్లకి కట్టినట్టు చూపించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే చరిత్రని చూపించాడు. సినిమాకి నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ అద్భుతంగా కుదిరాయి. దొరసాని 2019లోలోనే బెస్ట్ ప్రేమకథ చిత్రంగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోందని పబ్లిక్ టాక్.