రివ్యూ : నిను వీడని నీడని నేనే

చిత్రం : నిను వీడని నీడని నేనే (2019)

నటీనటులు : సందీప్‌కిష‌న్‌, అన్యాసింగ్‌, పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, పూర్ణిమ భాగ్యరాజ్, ప్రగతి తదితరులు

సంగీతం : ఎస్.ఎస్. తమన్

దర్శకత్వం : కార్తీక్ రాజు

నిర్మాతలు : దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్‌

రిలీజ్ డేటు : 12 జులై 2019

యంగ్ హీరో సందీప్‌ కిషన్‌ నిర్మిస్తూ నటించిన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. అద్దంలో చూసుకున్నప్పుడు మరొకరి ప్రతిబింబం కనిపించడమనే ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌’తో తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రానికి కార్తిక్‌ రాజు దర్శకత్వం వహించారు. వెన్నెల కిశోర్‌, పోసాని కృష్ణమురళి కీలక పాత్రల్లో నటించారు. టీజర్, ట్రైలర్ లతో అంచనాలని పెంచేసిన ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. సినిమా ఎలా ఉంది ? ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొంది ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

కాలేజీలో చదువుకొనే సమయంలోనే అర్జున్ (సందీప్‌కిష‌న్‌), మాధ‌వి ( అన్యాసింగ్) మ‌ధ్య ప్రేమ చిగురుస్తుంది.
పెద్దలని కాద‌ని పెళ్లి చేసుకుంటారు. హాయిగా జీవితం గడిపేస్తుంటారు. ఇంత‌లో వీరు కారులో ప్రయాణం చేస్తుండ‌గా రోడ్డు ప్రమాదం జ‌రుగుతుంది. ఆ ఘటన శ్మశానానికి ద‌గ్గర్లోనే జ‌రుగుతుంది. అప్పట్నుంచి అర్జున్‌, మాధ‌విలలో మార్పు వ‌స్తుంది. అద్దంలో చూసుకుంటే వారి ప్రతిరూపానికి బ‌దులు మ‌రొక‌రు క‌నిపిస్తుంటారు.

ఎందుకిలా జరుగుతుందని డాక్టర్‌ని సంప్రదిస్తే.. ‘మీరు అర్జున్, మాధ‌వి కాదు. రిషి (వెన్నెల‌కిషోర్‌), ఆయ‌న భార్య దియా’ అని చెబుతారు. ఇంత‌కీ రిషి, దియాలు ఎవరు ? అర్జున్, మాధవిల దేహాల్లో ఎందుకు ? ఎలా ?? ప్రవేశించారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్ :

* కాన్సెప్ట్

* సందీప్, అనన్యల నటన

* క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :

* సెకాంఢాప్

* అక్కడక్కడ స్లో నేరేషన్

నటీనటుల ఫర్ ఫామెన్స్ :

నటీనటుల ఫర్ ఫామెన్స్ :

హార‌ర్‌, మిస్టరీ అంశాల మేళ‌వింపు రాసుకొన్న కథ ఇది. ఒక ప్రమాదం త‌ర్వాత ఒక‌రి రూపాలకి బ‌దులు మ‌రొక‌రి రూపాలు క‌నిపించ‌డం కొత్తగా అనిపిస్తుంటుంది. ఎందుకిలా జ‌రుగుతోందనే విషయాన్ని దర్శకుడు ఎమోషన్స్ తో కూడిన ముగింపు పలికాడు. ఇక, సందీప్‌ కిష‌న్ స్టైలిష్‌గా క‌నిపిస్తూనే, హార‌ర్ అంశాల్లో ఒదిగిపోయాడు. సెంటిమెంట్‌ ని కూడా బాగా పండించాడు. అన్యాసింగ్ పాత్రలో స‌హ‌జంగా ఒదిగిపోయింది. అందంగా కనిపించింది.

ఫస్టాఫ్ లో వెన్నెల‌ కిషోర్ అద్దంలో మాత్రమే క‌నిపిస్తుంటారు. కానీ క‌నిపించిన ప్రతిసారీ నవ్వించారు. ఇక సెకాంఢాఫ్ లో ఆయ‌న పాత్ర కూడా సెంటిమెంట్‌ని పండిస్తుంది. పోసాని కృష్ణముర‌ళి, ముర‌ళీశ‌ర్మ‌, ప్రగ‌తి, పూర్ణిమా భాగ్యరాజ్ త‌దిత‌రులు తమ తమ ప‌రిధి మేర‌కు నటించారు.

సాంకేతికంగా :

త‌మ‌న్ నేప‌థ్య సంగీతం బాగుంది. ప్రమోద్ వ‌ర్మ కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. తొలిభాగంలో కొన్ని చోట్ల సినిమా స్లోగా సాగినట్టు అనిపిస్తుంది. ఇక, సెకాంఢాఫ్ లో ఇలాంటి సీన్స్ చాలానే ఉన్నాయి. క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. ఎమోషనల్ ముగింపు పలికాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

బాటమ్ లైన్ : ‘నిను వీడని నీడని నేనే’ – హారర్+మిస్టరీ

రేటింగ్ : 3/5