వింబుల్డన్ విజేత హలెప్
వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేతగా సైమెనా హలెప్ విజేతగా నిలిచింది. ఫైనల్ లో ఫైనల్ లో సెరెనా విలియమ్స్ పై 6-2, 6-2 తేడాతో గెలిచింది. కేవలం 56 నిమిషాల్లో మ్యాచ్ ముగించి సంచలనం సృష్టించింది. వరుస రెండు సెట్లలోనూ సెరెనా ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.
ఈ ఓటమితో సెరెనా అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ సాధించిన మార్గరెట్ (24) రికార్డుకు సమం చేసే అవకాశాన్ని కోల్పోయింది. ఇక, హెలెప్ వింబుల్డన్ చరిత్రలో టైటిల్ గెలిచిన తొలి రొమేనియా మహిళగా చరిత్ర సృష్టించింది.