‘సాహో’ కోసం ఎన్ని కార్లు వాడారో తెలుసా ?


‘బాహుబలి’ తీస్తే, కత్తులు, ఈటెలు వంటి ఆయుధాల ఫ్యాక్టరీ పెట్టాల్సి వచ్చింది. ‘సాహో’ సంగతి వేరు. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో ఛేజింగ్ లు, యాక్షన్ సీన్లు హైలైట్ గా నిలవనున్నాయి. వీటి కోసం ఏకంగా రూ. 90కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారమ్. దుబాయ్ లో తీసిన ఛేజింగ్ సీన్ సినిమాకే హైలైట్ కానుందని చిత్రబృందం చెబుతోంది. దుబాయ్ ఛేజింగ్ ఎపిసోడ్ లోనే 56 కార్ల వరకు వాడారట. ఈ సీన్ కోసం ఓ ప్రత్యేకమైన ట్రక్ ను స్వయంగా తయారు చేయించారట. ఇక సినిమా మొత్తానికి 120 కార్లు వాడారట. ఒక్క మాటలో చెప్పాలంటే సాహో.. ఓ కార్ల కంపెనీ.

ఈ చిత్రానికి సుజీత్ దర్శకుడు. దాదాపు రూ. 400కోట్లకిపైగా బడ్జెట్ తో సాహో ని నిర్మించింది యూవీ క్రియేషన్స్. సాహో సినిమాకు ముంబాయి, విదేశీ నిపుణలు పనిచేసారు. ప్రభాస్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటిస్తున్నారు. శ్రద్దా కూడా యాక్షన్ చేసింది. అది టీజర్ లోనే చూశాం. సినిమాలో శ్రద్దా యాక్షన్’ని పూర్తిస్థాయిలో చూడబోతున్నాం. ఆగస్టు 15న సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది.