రస్మిక పర్సనల్ లైఫ్ లోకి విజయ్.. !
యంగ్ హీరోయిన్ రష్మిక మందన తొలి సినిమాతోనే ప్రేమలో పడింది. కన్నడ చిత్రం ‘కిర్రాక్ పార్టీ’ కోసం జంటగా నటించారు రక్షిత్-రస్మిక. తొలి సినిమాతోనే ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో నిశ్చితార్థం చేసుకొన్నారు. ఐతే, అది పెళ్లి వరకు వెళ్లలేదు. వీరిద్దరు బ్రేకప్ చెప్పుకొన్నారు. నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకొన్నారు. ఆ తర్వాత ఎవరికి వారు సినిమాలతో బిజీ అయ్యారు.
‘ఛలో’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన రస్మిక.. ఇక్కడ బిజీ అయింది. స్టార్ హీరోయిన్ గా ఎదిగే ప్రయత్నంలో ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు26వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటించింది. ఈ సినిమా తర్వాత రస్మిక పేరు స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరిపోవడం ఖాయం అంటున్నారు. ఐతే, రక్షిత్‌తో బ్రేకప్ గురించి రష్మికను ఇప్పటికీ ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఎందుకు విడిపోయారని, కారణాలు చెప్పమని అడుగుతున్నారు.
ఇటీవల డియర్ కామ్రేడ్ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న రష్మికకి మరోసారి రక్షిత్ బ్రేకప్ విషయంపై ప్రశ్న ఎదురైంది. దీనిపై పక్కనే ఉన్న విజయ్ దేవరకొండ స్పందించారు. ‘నీ ప్రశ్న నాకు అర్థం కాలేదు. ఒకరి వ్యక్తిగత జీవితంతో మరొకరికి అవసరం లేదు. మీరు అడగడం.. మేం చెప్పడం.. ఇదంతా అనవసరం కదా. ఇది మన పనికాదు’ అని విజయ్ అన్నారు. అనంతరం రష్మిక కల్పించుకుంటూ.. ‘ఇది నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్న ప్రశ్నే నాకే అర్థం చేసుకోవడం రావడం లేదు. అందుకే జవాబు చెప్పలేకపోతున్నా’నని కామెంట్ చేశారు. దీనిపై రస్మిక పర్సనల్ మేటర్ లోకి విజయ్ ఎంటర్ అవ్వడమేంటని మీడియా చెవులు గోక్కుంటోంది.