వర్మకు ఛార్మి మందు పార్టీ.. !
దర్శకుడు రామ్ గోపాల్ వర్మని మందు పార్టీకి ఆహ్వానించింది ఛార్మి. ఆమె హీరోయిన్ గా సినిమాలు మానేసి.. నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మిస్తోంది. వీరి తాజా చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు అదిరిపోయాయి. యూత్ కి పిచ్చెక్కిచ్చేలా ఉన్నాయి. దర్శకుడు వర్మకు కూడా ‘ఇస్మార్ట్ శంకర్’ పిచ్చ పిచ్చగా నచ్చేశాడు.
ఈ నేపథ్యంలో శిష్యుడు పూరి సినిమాకు పబ్లిసిటీ తీసుకొచ్చే పనిలో పడ్డాడు. ట్విటర్ వేదికగా ఇస్మార్ట్ శంకర్ పై ఓ రేంజ్ లో పొగడ్తలు కురిపించాడు. ఈసారి హిట్ గ్యారెంటీ అని రాసుకొచ్చాడు. ‘మీరు త్వరగా హైదరాబాద్ వచ్చేస్తే మీకిష్టమైన వోడ్కాలో మిమ్మల్ని ముంచేస్తాం’ సర్ అంటూ చార్మి బంపర్ ఆఫర్ ఇచ్చింది. మందు పార్టీ ఒక్కటేనా ? అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక, ఇస్మార్ట్ శంకర్ గా ఎనర్జిటి హీరో రామ్ కనిపించనున్నాడు. ఆయనకి జోడిగా నిధి అగర్వాల్, నభా నటాషా నటించారు. హైదరాబాది యాసలో రామ్ చెప్పే డైలాగ్స్, ఆయన చేసిన రొమాన్స్ నాటుగా ఉండబోతుందని టీజర్, ట్రైలర్ తో అర్థమవుతోంది. దానికి తగ్గట్టుగానే సెన్సార్ బోర్డ్ ఇస్మార్ట్ శంకర్ కి ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది. మరీ.. ఏ సర్టిఫికెట్ తో పూరి ఫ్యామిలీ ప్రేక్షకులని ఏ మేరకు మెప్పిస్తాడన్నది చూడాలి.