అక్షర హాసన్ ప్రెగ్నెంట్.. !


కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర హాసన్ ప్రెగ్నెంట్ అయింది. పెళ్లి కాకుండానే తల్లి అయిందా ? అనుకొనేరూ ! ఇది సినిమా ముచ్చట. విక్రమ్‌ కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం ‘కదరమ్‌ కొండన్‌’. తెలుగులో ‘మిస్టర్ కేకే’గా తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో అక్షర గర్భిణిగా కనిపిస్తుందట. ఆ సన్నివేశాల్లో నటించడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. అందుకే అమ్మ సారిక సలహాలు తీసుకున్నానని అక్షర తెలిపింది.

అక్షర చాన్నాళ్లు హీరోయిన్ గా కొనసాగదట. ఆమెకి దర్శకత్వంపై మక్కువ ఎక్కువ. తండ్రి కమల్ హాసన్ లా దర్శకత్వమూ చేయాలనుంది. ఇప్పటికే రెండు కథలు సిద్ధం చేస్తున్నా. నాన్నకి నా కథ నచ్చి, అన్నీ కుదిరితే మా సంస్థలోనే దర్శకురాలిగా సినిమా తీస్తానని అక్షర అంటోంది. ఇక, మిస్టర్ కేకే సినిమాకి రాజేష్‌ ఎం.సెల్వ దర్శకత్వం వహించారు. టి.నరేష్‌కుమార్‌, టి.శ్రీధర్‌ ఈ నెల 19న తెలుగులో విడుదల చేస్తున్నారు.