రెండ్రోజుల్లో హైదరాబాద్’కు నీటి కష్టాలు
తమిళనాడు రాజధాని చెన్నైకి నీటి కష్టాలొచ్చాయ్. తాగడానికి నీరు లేక చెన్నై ప్రజలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. అదే తరహా మరో రెండ్రోజుల్లో హైదారాబాద్ కు నీటి కష్టాలు రానున్నాయట. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. ఈ కథనం చదివి షాక్ అయిన దర్శకుడు మారుతి.. ఈ విషయాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు. ‘సర్ ఇది నిజమేనా’ అని ప్రశ్నించారు.
ఇందుకు కేటీఆర్ సమాధానమిస్తూ.. ‘ఆ వార్త కరెక్ట్ కాదు. మరికొన్ని వారాల్లో కాళేశ్వరం నీరు ఎల్లంపల్లి రిజర్వాయర్‌లోకి వస్తుంది. దీని ద్వారా హైదరాబాద్‌కు రోజుకు 172 మిలియన్ గ్యాలన్ల నీరు అందుతూనే ఉంటుంది. ఇందులో ఏ మార్పూ లేదు. చెన్నైలా హైదరాబాద్‌కు ఎప్పుడూ నీటి సమస్య ఏర్పడదు’ అని సమాధానమిచ్చారు.
Thank you sir for the happy news 👏👏👏
Yes, it's high time to realise the importance of water conservation & Harvesting
Save water 💧
Save Trees 🌳
Good environment makes our life #pratirojupandaage https://t.co/qMhjddzk2r— Maruthi director (@DirectorMaruthi) July 17, 2019