బీజేపీలోకి కొండా దంపతులు !

కొండా దంపతులకి రాజకీయ స్థిరత్వం లేకుండా పోయింది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన కొండా దంపతులు.. గత యేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. కొండా కుటుంబం ఆశించిన మూడు అసెంబ్లీ టికెట్లు కేటాయించికపోవడం వలన పార్టీ మారారనే ప్రచారం జరిగింది.

ఇప్పుడు కొండా దంపతులు బీజేపీ వైపు చూస్తున్నట్టు సమాచారమ్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంచి పట్టుకొన్న కొండా దంపతులని చేర్చుకొనేందుకు బీజేపీ అధిష్టానం కూడా సిద్ధంగా ఉంది. కానీ, ఇక్కడ ఒక్కటే చిక్కు వచ్చిపడింది. కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ భూపాలపల్లిలో చురుగ్గా వ్యవహరిస్తూ వస్తున్నారు.

అయితే, గత ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన గండ్ర సత్యనారాయణ కూడా బిజెపిలో చేరడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొండా దంపతులు, గండ్ర ఇద్దరిలో ఒకరిని మాత్రమే పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.