ఓంకార్.. ఈసారి లెక్క తప్పాడు !
‘రాజుగారి గది’ని ఓ బ్రాండ్ గా మార్చాడు ఓంకార్. ‘రాజుగారి గది’ పెద్ద హిట్. దాన్ని మించేలా ‘రాజుగారి గది2’ని ప్లాన్ చేశాడు. నాగార్జున, సమంతలని కీలక పాత్ర కోసం తీసుకొన్నాడు. సినిమాపై అంచనాలని పెంచాడు. రిలీజ్ కి ముందు తర్వాత కూడా రాజుగారి గది 2 ప్రేక్షకుల నోళ్లలో మారుమ్రోగింది. ఫలితంగా మంచి ఓపెనింగ్ కలెక్షన్స్.
ఇక మూడో గదిలోకి మిల్కీ బ్యూటీ తమన్నాని తీసుకొన్నాడు. సినిమాపై ఆసక్తిని పెంచేశాడు. ఐతే, బాలీవుడ్ నుంచి ఆఫర్ రావడంతో తమన్నా చెక్కేసింది. ఆమె స్థానంలో తాప్సీ, కాజల్ పేర్లు వినిపించాయి. వారిని కాదని అవికా గోర్ ని తీసుకొన్నాడు ఓంకార్. ఎక్కిడికిపోతావు చిన్నివాడ తర్వాత అవికా తెలుగు తెరపై కనిపించలేదు.
కొన్నాళ్లు చదువు పేరుతో సినిమాలకి దూరంగా ఉంది. ప్రస్తుతం తనకి ఇష్టమైన హిందీ సిరీయల్స్ లో నటిస్తోంది. అలాంటి అవికాని రాజుగారి గదిలోకి తీసుకొన్నాడు ఓంకార్. క్రేజ్ ప్రాజెక్ట్ ని నీరుగార్చాడు. మూడో గదితోనే రాజుగారి సిరీస్ కి పులిస్టాప్ పెట్టేలా ఉన్నాడు ఓంకార్. గది పిలుపుల కోసం చాలామంది హీరోయిన్స్ ఉన్నా.. ఓంకార్ ని అవికానే ఎందుకు ఆకర్షించింది ? అన్నది అర్థంకావడం లేదు. బహుశా.. అవికా బాగా భయపెడుతుందని ఓంకార్ భావించి ఉంటారేమో.. !