జబర్థస్త్’పై బిగ్ బాస్ ఎఫెక్ట్ !
జబర్థస్త్, పటాస్.. లాంటి టీవీ షోస్ కి సెన్సార్ చేయాలనే డిమాండ్ చాన్నాళ్ల నుంచి ఉంది. ఐతే, ఇప్పుడు బిగ్ బాస్ 3 పుణ్యమా అని ఈ విషయం తేలిపోనుంది. బిగ్ బాస్ 3 కి సెన్సార్ నిర్వహించిన తర్వాతే ప్రసారం చేయాలని నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బిగ్ బాస్ రియాలిటీ షోపై ఆయన పలు ఆరోపణలు చేశాడు. ఆ కార్యక్రమంలో పాల్గొనే వారిని నిర్వాహకులు రెచ్చగొడతారని, తక్కువ సమయంలో గుర్తింపు వస్తుందని అందులో పాల్గొనేవారు కూడా రెచ్చిపోతారని .. ఇలాంటి రచ్చకు సెన్సార్ లేకపోవడం ఏంటని ప్రశ్నించారు.
ఈ పిటిషన్ పై కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందన్నది ఆసక్తిగా మారింది. వాస్తవానికి టీవీ కార్యక్రమాలని సెన్సార్ ఉండటం లేదు. పటాస్, జబర్థస్త్ షోస్ లో బోలేడు బూతులు వినిపిస్తుంటాయి. ఆ స్పైసీ కారణంగా ఈ షోస్ హిట్ అయ్యాయి. ఐతే, ఇప్పుడు బిగ్ బాస్ 3 పై దాఖలైన పిటిషన్ తో టీవీ షోస్ సెన్సార్ అవసరమా ? కాదా ?? అనే విషయాన్ని తేల్చేయనుంది. టీవీ షోస్ కి సెన్సార్ నిర్వహించాల్సిందేనని కోర్టు తీర్పునిస్తే మాత్రం జబర్థస్త్, పటాస్ షోస్ డోస్ తగ్గడం ఖాయం. అప్పుడు క్లీన్ ఎంటర్ టైన్ మెంట్ మాత్రమే బుల్లితెరపై ప్రేక్షకులకి దక్కుతుంది.