స్నేహితుడి కూతురుతో సల్మాన్ రొమాన్స్


బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్నేహానికి ప్రాణమిస్తాడు. ఆయనకి టాలీవుడ్ సినీ స్టార్స్ తో మంచి స్నేహబంధముంది. మెగాస్టార్ చిరంజీవికి మంచి స్నేహితుడు. మెగాస్టార్, ఆయన తనయుడు రామ్ చరణ్ సినిమాల షూటింగ్స్ ముంబైలో జరిగితే.. సల్మాన్ ఆతిథ్యం స్వీకరించాల్సిందే. సల్మాన్ హైదరాబాద్ వస్తే.. మెగాస్టార్ ఇంటి నుంచి భోజనం వెళ్లాల్సిందే. ఇక, విక్టరీ వెంకటేష్ కు సల్మాన్ మంచి స్నేహితుడు.

స్నేహితులకి ఇచ్చిన మాటని సల్మాన్ ఎప్పుడు తప్పడు. ఈ విషయం మరోసారి రుజువైంది. మహేష్ మంజ్రేకర్ సల్మాన్ కి మంచి స్నేహితుడు. ఆయన కూతురు సయినిని హీరోయిన్ గా పరిచయం చేస్తానని అప్పట్లో మాటిచ్చాడట. ఇప్పుడీ మాటని నిలబెట్టుకొంటున్నాడు. దబాంగ్ 3 కోసం సయినిని హీరోయిన్ గా తీసుకొన్నాడు.

ప్రభుదేవా దర్శకత్వంలో దబాంగ్ 3 తెరకెక్కుతోంది. సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మరో హీరోయిన్ కి కూడా ఛాన్స్ ఉంది. ఇందుకోసం వేరే హీరోయిన్ ని ఎంపిక చేశాడు దర్శకుడు. ఐతే, సల్మాన్ రెఫరెన్స్ తో సయిని ని తీసుకొన్నారు.