టబు రేటు ఎంతో తెలుసా ?


వయసులో ఉన్నప్పుడు ఓ ఊపు ఊపేసింది బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొంది. తెలుగులోనూ ఆమెకి హిట్స్ ఉన్నాయి. ‘నిన్నే పెళ్లాడతా’లో ఆమె నాగ్ తో చేసిన రొమాన్స్ గురించి ఇప్పటికీ మాట్లాడుకొంటారు.

ఇప్పటికీ బాలీవుడ్ లో యంగ్ హీరోయిన్స్ కి టబు తీవ్ర పోటీ ఇస్తోంది. ఆమె నటించిన ‘అందాదున్, దే దే ప్యార్ దే’ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇలాంటి సమయంలో ఆమె తెలుగు సినిమాలో నటిస్తోంది. త్రివిక్రమ్-బన్నీ హ్యాట్రిక్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఐతే, ఈ సినిమా కోసం టబు భారీ రెమ్యూనరేషన్ తీసుకొంటున్నట్టు టాక్. హీరోయిన్ గా నటిస్తున్న పూజా హెగ్డే కంటే టబు రేటే ఎక్కువట. అదెంత ? అనేది మాత్రం బయటకి చెప్పడం లేదు.

ఇక, ఈ సినిమా కోసం ‘నాన్న.. నేను’, ‘అలకనంద’ టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. నవదీప్, సుశాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక & హాసినీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.